Home > తెలంగాణ > అధికారం కోసం కాదు ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలు చేస్తాం : రాజ్నాథ్ సింగ్

అధికారం కోసం కాదు ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలు చేస్తాం : రాజ్నాథ్ సింగ్

అధికారం కోసం కాదు ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలు చేస్తాం : రాజ్నాథ్ సింగ్
X

బీజేపీ అధికారం కోసం కాదు ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం కోసం నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మేడ్చల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని.. తాము అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని విచారించి జైలుకు పంపిస్తామన్నారు. అధికారంలోకి రాకముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చలేదన్నారు.

కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. గుజరాత్ దేశానికి మోడల్‌గా నిలిచిందని.. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని.. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమన్నారు. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. అయోధ్య, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు. కానీ హామీల అమలు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చిత్థశుద్ధి లేదని విమర్శించారు.

మోదీ ప్రధాని అయ్యాక అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందని రాజ్ నాథ్ చెప్పారు. ప్రధాని అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. కేంద్ర విడుదల చేసే ప్రతి రూపాయి లబ్దిదారులకు చేరుతుందని చెప్పారు. 2014లో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఆర్థికవ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో మూడో స్థానానికి చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆరు గ్యారెంటీలు అమలుకావట్లేదన్న రక్షణమంత్రి.. అయినా అధికారం కోసం అతిగా హామీలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పి.. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 24 Nov 2023 7:21 PM IST
Tags:    
Next Story
Share it
Top