Delhi Liquor Case : నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
X
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో నేడు మరో కీలక పరిణామం జరుగనుంది. సుప్రీంకోర్టులో కవిత కేసు తుది విచారణకు రానుంది. ఈ నెల 5 న జరిగిన విచారణలో ఈడీ నోటీసులకు కవిత హాజరుకావడంలేదని అడిషినల్ సొలిసిటర్ జనరల్. సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఈడీ నోటీసులను సవాల్ చేయడం వల్లే హాజరుకాలేదని చెప్పారు కవిత తరఫు లాయర్ కపిల్ సిబల్. అనంతరం కోర్టు.. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, కవిత కేసులను ఈనెల 16వ తేదీన ఉమ్మడిగా విచారిస్తామని స్పష్టం చేసింది. జస్టీస్ బేలా ఎం త్రివేది, జస్టీస్ పంకజ్ మిట్టల్‌ల ధర్మాసనం నేడు తీర్పును విచారించనున్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కవిత కోరారు.