Home > తెలంగాణ > ఢిల్లీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్

ఢిల్లీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌‌కు బెయిల్ మంజూరైంది. అతనికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన 5 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని, పాస్ పోర్డు సరెండర్ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణకు ఏప్రిల్ 29న వాయిదా వేసింది. ఈడీ కేసుల్లో ట్రయల్స్‌ జాప్యంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్స్‌ జాప్యం జరిగితే నిందితులు నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వస్తుంది కదా? అని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 29వ తేదీకి వాయిదా వేసింది.

లిక్కర్‌ స్కామ్‌లో 2022 అక్టోబర్‌లో అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 2021లో ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి, గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చివేసి నూతన లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్‌ పాలసీ కాస్త స్కాం వైపుకు దారి తీసిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్‌ అయ్యారు. తాజాగా కవితను అరెస్ట్‌ చేసింది ఈడీ. కవిత ఇంట్లో నాలుగు గంటలకుపైగా సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను ఆరెస్ట్‌ చేశాన సంగతి తెలిసిందే.

Updated : 20 March 2024 12:32 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top