Dell Company : ఆ మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే..వారికి హెచ్చరిక
X
తమ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందేనని డెల్ కంపెనీ స్పష్టం చేసింది. లేదంటే కెరీర్‌కు ఎదురుదెబ్బ తప్పదని తమ ఉద్యోగులను హెచ్చరించింది. కరోనా వల్ల అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించాయి. డెల్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు రిమోట్ వర్క్ సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటికి కూడా డెల్ కంపెనీలో 60 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
కరోనా కేసులు చాలా వరకూ తగ్గిన తరుణంలో ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటూ పిలుస్తున్నాయి. అయితే ఇంటి వద్ద ఉండి పని చేయడానికి అలవాటు పడిన ఆ ఉద్యోగులు ఆఫీసులకు రాలేమని చెప్పేశారు. డెల్ కంపెనీలో కూడా చాలా మంది ఉద్యోగులు ఆఫీసులకు రాలేమన్నారు. ఈ నేపథ్యంలో డెల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆఫీసులకు గంట సేపటిలో చేరుకునే అవకాశం ఉన్న ఉద్యోగులందరూ వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాలని డెల్ కంపెనీ ఆదేశించింది. గతంలోనే ఈ విషయాన్ని తమ ఉద్యోగులకు చెప్పింది. అయితే తాజాగా మరో విషయాన్ని చెప్పింది. తమ ఉద్యోగులంతా ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారానికి మూడు సార్లు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి కెరీర్ ఎదుగుదలతో ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించింది.