ప్రజాభవన్‌లో నూతన గృహ ప్రవేశం చేసిన డిప్యూటీ సీఎం భట్టి
X
తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం చేశారు. గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. గృహ ప్రవేశం అనంతరం భట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్‌లోకి గృహ ప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. గృహ ప్రవేశం సందర్భంగా ప్రజా భవన్‌లో ప్రత్యేక అలంకరణ చేశారు.
It is #Gruhapravesam into #PrajaBhavan for #TelanganaDeputyCM #BhattiVikramarka & family @ndtv @ndtvindia #AHouseForMrBhatti; Wishing @BhattiCLP the best !! pic.twitter.com/grnH7IZ8VD
— Uma Sudhir (@umasudhir) December 14, 2023
ఇక, గత ప్రభుత్వంలో ప్రగతిభవన్ సీఎం అధికారిక నివాసం ఉండగా కాంగ్రెస్ సర్కారు దాని పేరును ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఆ ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, ప్రజాదర్బార్‌ను కొత్త ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు.