Home > తెలంగాణ > Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్తో నయా పైసా లాభముందా..? బీఆర్ఎస్ నేతలకు భట్టి కౌంటర్..

Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్తో నయా పైసా లాభముందా..? బీఆర్ఎస్ నేతలకు భట్టి కౌంటర్..

Bhatti Vikramarka : ఫార్ములా ఈ రేస్తో నయా పైసా లాభముందా..? బీఆర్ఎస్ నేతలకు భట్టి కౌంటర్..
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలున్నాయని, వాటిని సాకారం చేసే ప్రయత్నంలో ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిందని, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గత సర్కారు లోపాలను సరిచేసే పని మొదలుపెట్టామని చెప్పారు. రాష్ట్ర వనరులను, ప్రతి పైసాను ప్రజల కోసం వినియోగిస్తామని భట్టి స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ రేస్ రద్దుతో నష్టం జరిగిందన్న మాజీ మంత్రులకు భట్టి కౌంటర్ ఇచ్చారు. దాని వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని అన్నారు. ఈ రేసుతో రాష్ట్రానికి నయా పైసా ఆదాయం రాదని భట్టి తేల్చి చెప్పారు. ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలని అన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్స్ట్ జెన్, ప్రభుత్వం మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందని.. బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ఫార్ములా ఈ రేస్ కోసం రూ.110 కోట్లు కట్టారని మండిపడ్డారు. ఎవరో వచ్చి ఈ రేస్ చూసి వెళ్లేందుకు మనం ఎందుకు డబ్బులు కట్టాలని ప్రశ్నించారు.

ఫార్ములా ఈ రేస్ టికెట్లు అమ్ముకుని ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ లబ్ది పొందాలని చూసిందని భట్టి ఆరోపించారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం కేవలం ట్రాక్ సదుపాయం మాత్రమే కల్పించాలని స్పష్టం చేశారు. ఫార్ములా రేస్ అగ్రిమెంట్పై లీగల్గా ముందుకెళ్తామని భట్టి హెచ్చరించారు.




Updated : 9 Jan 2024 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top