Bhatti Vikramarka:విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం.. భట్టి విక్రమార్క
X
విద్యుత్ సరఫరాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు దుష్ప్రచారం మానకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వేసవిలోనూ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సరఫరాపై కావాలనే పనిగట్టుకొని మరీ బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా వారిలో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బ తినడం ఖాయమని చెప్పారు.
విద్య, వైద్యాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ఆస్తులు, సంపద సృష్టిస్తే బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం ప్రతి కార్యకర్త కష్టపడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కంప్యూటర్ రంగాన్ని మొదట కాంగ్రెస్ తెచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడ పరిశ్రమలు రావడానికి కారణం ఆనాటి కాంగ్రెస్ నాయకులేనని భట్టి విక్రమార్క తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు బుద్ధి సరిచేసుకోవాలని హితవు పలికారు