Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం
X
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు హోమియో ఎమ్‌డి చదివారు. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్‌గా కూడా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
గత మూడు నెలల నుంచి కాలేయ సంబంధిత వ్యాధిలో మల్లు వెంకటేశ్వర్లు బాధపడుతున్నారు. దీంతో ఆయన్ని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతుండగా మూడు రోజుల క్రిత గుండెపోటు రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. మంగళవారం ఉదయం 6.50 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. సోదరుడి మరణవార్తతో భట్టి విక్రమార్క తమ స్వగ్రామానికి బయల్దేరి వెళ్లారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.