Home > తెలంగాణ > బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా

బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా

బీఆర్ఎస్కు డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా
X

గ్రేటర్ హైదరాబాద్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. కార్పొరేటర్, మేయర్ స్థాయి నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఆ పార్టీకార్మిక విభాగం స్టేట్ చీఫ్ శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను శనివారం పార్టీ అధినేత కేసీఆర్ కు అందిచారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు వారిని బాధిస్తున్నట్లు లేఖలో తెలిపారు.

గత పదేళ్లలో పార్టీలోని ఉద్యమకారులకు మనుగడ కరువైంది. పార్టీ కోసం 24 ఏళ్లుగా పనిచేస్తున్నాం. కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం బాధిస్తుందని లేఖలో చెప్పుకొచ్చారు. కాగా ఇటీవలే.. మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరు సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Updated : 24 Feb 2024 4:27 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top