Home > తెలంగాణ > కేసీఆర్ దత్తత గ్రామంలో మారుతున్న రూపురేఖలు

కేసీఆర్ దత్తత గ్రామంలో మారుతున్న రూపురేఖలు

కేసీఆర్ దత్తత గ్రామంలో మారుతున్న రూపురేఖలు
X

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయి. 152 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు 2020 నవంబర్ 1న సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2021 జూన్ 22న గ్రామంలో సభ నిర్వహించిన గ్రామస్థుల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. వాసాలమర్రి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామంలోని గుడిసెలు, ఇళ్లను కూల్చేసి పక్కా ఇల్లు నిర్మించాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణంతోపాటు మిగిలిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.3.58 కోట్లు, మూడు అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.75 లక్షలు, అదనంగా ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి రూ.20 లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఈ పనులన్నీ కొనసాగుతున్నాయి.

విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం కూడా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. వాసాలమర్రితో పాటు పరిసర గ్రామాలకు సైతం విద్యుత్ను అందించేందుకు మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తైంది. కేసీఆర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలే మారిపోతున్నాయని సర్పంచ్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ పూర్తైతే తమ గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారు.






Updated : 8 Aug 2023 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top