Home > తెలంగాణ > Medaram : హెలికాప్టర్‌లో మేడారానికి.. హైదరాబాద్ నుంచి ఒక్కరికి ఎంతంటే..?

Medaram : హెలికాప్టర్‌లో మేడారానికి.. హైదరాబాద్ నుంచి ఒక్కరికి ఎంతంటే..?

Medaram : హెలికాప్టర్‌లో మేడారానికి.. హైదరాబాద్ నుంచి ఒక్కరికి ఎంతంటే..?
X

మేడారం జాతరకు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరగనుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాటపట్టారు. లక్షల మంది భక్తుల రాకతో మేడారం మరో కుంభమేళాను తలపిస్తుంది. మహాజాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. మేడారానికి ఎడ్ల బండ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తుంటారు. అయితే గత ఆరేళ్ల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మలదర్శనానికి ఆకాశ మార్గాన వచ్చే సదుపాయాన్ని హెలీటాక్సీ సంస్థ కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భక్తులకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హన్మకొండ నుంచి మేడారానికి ఒక్కరికి రూ.28,999 ఛార్జ్ చేస్తారు. ఈ ప్యాకేజీలో మేడారం తీసుకెళ్లి వీఐపీ దర్శనం చేయించి మళ్లీ హన్మకొండ తీసుకొస్తారు. ఇక హైదరాబాద్ నుంచి మేడారానికి ఒక్కరికి రూ.95,833 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలోపై మేడారానికి తీసుకెళ్లి వీఐపీ దర్శనం చేయించి మళ్లీ హైదరాబాద్ తీసుకొస్తారు. మరిన్ని వివరాలకు 74834-32752, 94003-99999 నంబర్లలో సంప్రదించవచ్చునని సంస్థ తెలిపింది.

Updated : 20 Feb 2024 1:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top