Home > తెలంగాణ > రాష్ట్రంలో గతేడాది కంటే పెరిగిన క్రైమ్ రేట్.. డీజీపీ రవి గుప్తా

రాష్ట్రంలో గతేడాది కంటే పెరిగిన క్రైమ్ రేట్.. డీజీపీ రవి గుప్తా

రాష్ట్రంలో గతేడాది కంటే పెరిగిన క్రైమ్ రేట్.. డీజీపీ రవి గుప్తా
X

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 2023 లో 8.97 శాతం నేరాలు పెరిగాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. శుక్రవారం 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఒక శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. 41 శాతం కోర్టు శిక్షలు పెరిగాయని, జీవిత ఖైదు 39శాతం పెరిగిందని చెప్పారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వెల్లడించారు. 1 లక్షా 38 వేల ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా అందాయని తెలిపారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ డయల్ 100, 112 రాష్ట్రంలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోందని ఈ ఏడాది వీటి ద్వారా 16 లక్షల కాల్స్ వచ్చాయని చెప్పారు. వీటికి సగటున 7 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యామన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ లీడర్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.

మరోవైపు ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వార్షిక నేర నివేదికలను ఆయా పోలీసు కమిషనర్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాచకొండ​ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక 2023 బుక్‌ను విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్​ స్టేషన్ల కన్నా ట్రాఫిక్‌ పోలీస్​ స్టేషన్లు పెరిగాయని వెల్లడించారు. సైబర్‌ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు పెరిగాయని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు.

Updated : 29 Dec 2023 1:05 PM IST
Tags:    
Next Story
Share it
Top