Home > తెలంగాణ > ఒక్క ఛాన్స్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా: DH శ్రీనివాసరావు

ఒక్క ఛాన్స్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా: DH శ్రీనివాసరావు

ఒక్క ఛాన్స్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా: DH శ్రీనివాసరావు
X



సీఎం కేసీఆర్‌ ఒక్క ఛాన్స్ ఇస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌(డీహెచ్‌) డా. శ్రీనివాసరావు అన్నారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై గత కొద్ది రోజులుగా హింట్ ఇస్తూ వస్తున్న డీహెచ్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. శనివారం కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీలోని ‘జనహితం’ కార్యాలయంలో .. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా.. తాను ప్రత్యక్ష రాజకీయలలోకి తప్పకుండా వస్తానని.. అది కూడా సీఎం కేసీఆర్ అనుమతితోనేనని చెప్పారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని. బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తనకు ఇంకా ఏడేళ్ల ఉద్యోగ సర్వీస్ ఉందని.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.

తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్సార్‌ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి అవకాశాలు వెతుక్కొంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్‌, సుదూర ప్రాంతాలకు తరలివెళ్తున్నారని.. ఈ నేపథ్యంలో ‘కొత్త కొత్తగూడెం’ నిర్మాణమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అదేవిధంగా జీఎస్ఆర్ ట్రస్ట్ సేవలు కొనసాగుతాయన్నారు

గతంలో డీహెచ్ శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా.. ఆయన కేసీఆర్ కాళ్ల మొక్కారు. శ్రీనివాసరావు వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు గతంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రవేశంపై వార్తలు వచ్చాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో అక్కడి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయనకు విశ్రాంతిని ఇచ్చేద్ధాం అంటూ జనాలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి.




Updated : 11 Jun 2023 9:15 AM IST
Tags:    
Next Story
Share it
Top