ధర్మపురి అరవింద్కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని బీజేపీ కార్యకర్తల ధర్నా
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్.. ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అరవింద్ కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని నాంపల్లిలోకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు జగిత్యాల బీజేపీ కార్యకర్తలు, లీడర్లు ధర్నాకు దిగారు. వీరిలో సతీష్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇదివరకు ఎంపీగా గెలిచిన అరవింద్.. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసినట్లు వారు ఆరోపించారు. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా.. ఏ నాయకుడు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఈసారి అరవింద్ కు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని వారు స్పష్టం చేశారు. ‘వి వాంట్ జస్టిస్. అహంకార అరవింద్ మాకొద్దు. అరవింద్ హటావో బీజేపీ బచావో’ అంటూ ప్లకార్డులు పట్టుకుపి ఆందోళనకు దిగారు. కాగా సీనియర్ లీడర్లు కలుగజేసుకోవడంతో.. కార్యకర్తలు వెనుదిరిగారు.