Home > తెలంగాణ > షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలాడు

షటిల్ ఆడుతూ.. కోర్టులోనే కుప్పకూలాడు

మరణం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న వారిని కూడా మృత్యుఒడికి చేరుస్తున్నాయి. అప్పటివరకు ఆడుతూ, పాడుతూ సరదగా గడిపిన వారు కొన్నిసార్లు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి సరదాగా షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు.


జగిత్యాల పట్టణానికి చెందిన బూస వెంకట రాజా గంగరాజం (53) శుక్రవారం ఉదయం స్థానిక క్లబ్ లో షెటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు గంగరాజం కు సిపిఆర్ చేసి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత హాస్పిటల్ తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందాడు. అప్పటివరకు బాగానే ఉండి ఉల్లాసంగా షెటిల్ ఆడుతున్న వ్యక్తి సడన్ గా హార్ట్ స్ట్రోక్ కు గురై చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. ఈ విషాదం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.





Updated : 2 Jun 2023 1:19 PM IST
Tags:    
Next Story
Share it
Top