జగిత్యాలలో ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్..ఆ తర్వాత..
Krishna | 9 Jan 2024 9:19 AM IST
X
X
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానకులు భయాందోళన చెందారు. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేశారు. అయితే డ్రైవర్ ట్యాంకర్ నుంచి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘట్‌కేసర్ నుంచి జగిత్యాల జిల్లా రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Updated : 9 Jan 2024 9:19 AM IST
Tags: jagtial metpally venkatraopet road accident diesel tanker diesel tanker accident diesel tanker hits transformer lorry accident petrol tanker accident telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire