Telangana Assembly Session: నేడు అసెంబ్లీలో 2024- 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ
X
ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు. ముగ్గురు దివంగత శాసన సభ్యులకు నివాళులర్పించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత బి.మచ్చిందర్ రావు, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే దివంగత పి నరసారెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు లకు నివాళిగా మౌనం పాటిస్తారు. ఆ తర్వాత శాసనసభలో ద సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2024 (ప్రొహబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ప్రొడక్షన్, సప్లై, అండ్ డిస్టిబ్యూషన్)
సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. బిల్లును చర్చకు పెట్టి అనంతరం సభ ఆమోదానికి కోరుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆ తర్వాత 2024- 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. దీనిపై కూడా వాడి వేడి చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాయలసీమ ప్రాజెక్టుకు అనుమతిపై కేసీఆర్ ను ఉద్దేశించి ఓ వీడియోను కూడా అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
కృష్ణా జలాల అంశంపై .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో..
అసెంబ్లీలో వీటిపై ఫుల్ క్లారిటీ ఇస్తామని అధికార కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. అసెంబ్లీలో తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఇవాళ తెలంగాణ ప్రజలకు అసలు నిజాలు చెప్తామన్నాంటున్నారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.