Home > తెలంగాణ > VRS కు అప్లై చేసిన దిశా కేసు విచారణ అధికారి.. కారణమేంటో..?

VRS కు అప్లై చేసిన దిశా కేసు విచారణ అధికారి.. కారణమేంటో..?

VRS కు అప్లై చేసిన దిశా కేసు విచారణ అధికారి.. కారణమేంటో..?
X

హైదరాబాద్ నగర శివార్లలో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ అధికారిగా పనిచేసిన సురేందర్ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బదీలపై అసంతృప్తితోనే ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం సురేందర్ డీజీపీకి దరఖాస్తు సమర్పించారు. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో ఆయన షాద్‌నగర్ ఏసీపీగా ఉన్నారు. సురేందర్ కొన్నాళ్లు ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఏస్పీగా పనిచేశారు. ఇటీవలే సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్‌కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక, సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దిశా కేసులో ఉన్న నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ లో పాల్గొన్న వారిలో అప్పటి షాద్‌నగర్ ఏసీపీ వి.సురేందర్‌ కూడా ఉన్నారు. నిందితులు తమ ఆయుధాలు లాక్కుని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరిపారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అఫిడవిట్‌లో ఆ విషయాన్ని ఎక్కడా పేర్కొనకపోవడంపై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించగా.. ఎన్‌కౌంటర్ తర్వాత తన మానసిక స్థితి బాగోలేదని, అందుకనే వివరాలను సరిగా నమోదు చేయలేకపోయానని చెప్పారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది.

Updated : 28 Aug 2023 6:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top