Home > తెలంగాణ > హైదరాబాదీలకు అలర్ట్.. రెండ్రోజులపాటు నీళ్లు బంద్

హైదరాబాదీలకు అలర్ట్.. రెండ్రోజులపాటు నీళ్లు బంద్

హైదరాబాదీలకు అలర్ట్.. రెండ్రోజులపాటు నీళ్లు బంద్
X

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది. ఈ నెల19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తాగు నీటి సరఫరా బంద్‌ చేస్తున్నారు. వాటర్ బోర్డు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న 3వేల ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపులైనుకు 22.4 కి.మీ, 24.05 కిలోమీటర్ల దగ్గర కిలోమీటర్ల దగ్గర లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీని కారణంగా రెండు రోజుల పాటు భాగ్యనగరానికి తాగునీటి సరఫరా బంద్ కానుంది.

నీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలిగే ప్రాంతాలివే..

బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్ బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్ నగర్, మయూరినగర్, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరా పాక్షికంగా అంతరాయం కలగనుంది.

పూర్తిగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

కూకట్ పల్లి డివిజన్ ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్, కుత్బుల్లాపూర్ డివిజన్​షాపూర్ నగర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, మల్కాజిగిరి పరిధి సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, కాప్రా మున్సిపాలిటీలోని సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు, నాగారం, దమ్మాయిగూడ , రాంపల్లి,కీసర ,బొల్లారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దేవరయాంజల్, హకీంపేట, ప్రజ్ఞాపూర్​, గజ్వేల్, ఆలేరు, శామీర్​పేట, మేడ్చల్, కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా ఉండదని చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

Updated : 18 July 2023 6:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top