Home > తెలంగాణ > D K Aruna : హైకోర్టు కాపీ అందజేయాలని అసెంబ్లీలో అడుగుపెట్టిన డీకే అరుణ.. కానీ..

D K Aruna : హైకోర్టు కాపీ అందజేయాలని అసెంబ్లీలో అడుగుపెట్టిన డీకే అరుణ.. కానీ..

D K Aruna  : హైకోర్టు కాపీ అందజేయాలని అసెంబ్లీలో అడుగుపెట్టిన డీకే అరుణ.. కానీ..
X

గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణ మోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది. అదే సమయంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం బేషజాలకు పోకుండా తీర్పును గౌరవించాలని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు అసెంబ్లీ కార్యదర్శి మరియు స్పీకర్ ను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. .

హైకోర్టు తీర్పు కాపీని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు డీకే అరుణ సమర్పించారు. ఇక ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవాలని ఆమె భావించారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు అందించాలనుకున్నారు. కానీ ఆయన కూడా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో పని ఉందని ఆయన అసెంబ్లీకి రాలేదు. దీంతో అసెంబ్లీ కార్యాలయంలో జాయింట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డిని కలిశారు డీకే అరుణ. ఆయనకే హైకోర్టు తీర్పు కాపీని అందించారు. హైకోర్టు తీర్పు మేరకు తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుపై ప్రభుత్వ ఒత్తిడి ఉందని తెలుస్తుందన్నారు. తెలంగాన హైకోర్టు తీర్పు కాపీ రావడానికి ఆలస్యమైందన్నారు. ఈ తీర్పు కాపీని అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. కానీ వారిద్దరూ అందుబాటులో లేరన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఆమె కోరారు. హైకోర్టు తీర్పు రావడానికి ఆలస్యమైందన్నారు. ఈ తీర్పు నాలుగేళ్ల ముందే వస్తే తన నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు.





Updated : 1 Sept 2023 12:57 PM IST
Tags:    
Next Story
Share it
Top