Home > తెలంగాణ > ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ స్కెచ్.. రాష్ట్రానికి డీకే శివకుమార్

ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ స్కెచ్.. రాష్ట్రానికి డీకే శివకుమార్

ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్ స్కెచ్.. రాష్ట్రానికి డీకే శివకుమార్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించింది. తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పార్టీ హైకమాండ్ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతల్ని కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్కు అప్పగించింది. గెలిచినా, హంగ్ లేదా తక్కువ మెజార్టీ వచ్చినా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపుకు సన్నాహాలు చేస్తున్నారు. హంగ్ వస్తే క్యాంప్ రాజకీయాలన్నీ డీకే కనుసన్నల్లోనే జరగనున్నట్లు సమాచారం. మేజిక్ ఫిగర్ దాటినా ఎమ్మెల్యేలందరినీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గెలిచిన అభ్యర్థులంతా తమ పార్టీతోనే ఉంటారని DK శివకుమార్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తమ పార్టీ అభ్యర్థులు కొందరితో బీఆర్ఎస్ పెద్దలు నేరుగా మాట్లాడారని ఆరోపించారు. ఈ విషయాన్ని తమ అభ్యర్థులే స్వయంగా చెప్పారని శివకుమార్‌ వెల్లడించారు. తాను ఎగ్జిట్ పోల్స్ను నమ్మనన్న ఆయన.. సొంతంగా పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని చెప్పారు. తన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ రాబోతోందని తేలిందని చెప్పారు.

తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో గెలిచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నేలేదని డీకే స్పష్టం చేశారు.

Updated : 2 Dec 2023 11:53 AM IST
Tags:    
Next Story
Share it
Top