భూముల వేలం: ప్రభుత్వానికి కాసుల పంట.. కోట్లు పలికిన ఎకరం భూమి..
X
హైదరాబాద్ శివారులోని కోకాపేటలో భూముల ధరలు ఆల్టైమ్ రికార్డ్ సృష్టిస్తున్నాయి. నియో పోలిస్ రెండో విడత భూముల వేలంతో రాష్ట్ర సర్కారుకు కాసుల పంట పండింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో.. ప్లాట్ నంబర్ 6, 7, 8, 9, 10 భూములు రికార్డ్ ధర పలికాయి. ప్లాట్ 10 ఏకంగా రూ.100.75 కోట్లు దాటడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గురువారం (ఆగస్ట్ 3) జరిగిన ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడ్డాయి. మైంహోం, రాజపుష్ఫ సంస్థల మధ్య జరిగిన హోరాహోరీ బిడ్ జరిగింది.
గతంలో కోకాపేటలోని 49 ఎకరాల భూములను వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు ఎకరాకు కనిష్టంగా రూ.31 కోట్ల నుంచి రూ. 60 కోట్ల ధర పలికింది. ఈ ఏడాది జరుగుతున్న వేలంలో దాదాపు రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ ఆశిస్తోంది. మల్టీ పర్పస్ నిర్మాణాలు చేసుకునేందుకు నియో పోలీస్ భూములు అనువుగా ఉండటంతో.. వీటికి రికార్డ్ ధర పలుకుతోంది.