Home > తెలంగాణ > KCR : కేసీఆర్ హెల్త్ అప్డేట్.. మరో ఐదు రోజులపాటు హాస్పిటల్లోనే

KCR : కేసీఆర్ హెల్త్ అప్డేట్.. మరో ఐదు రోజులపాటు హాస్పిటల్లోనే

KCR : కేసీఆర్ హెల్త్ అప్డేట్.. మరో ఐదు రోజులపాటు హాస్పిటల్లోనే
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలుజారి పడటంతో.. ఎడమకాలి తుంటి విరిగింది. దీంతో ఆయనను హుటాహుటిన సోమాజిగుడలోని యశోద హాస్పిటల్ కు తరలిచారు. కాగా నిన్న కేసీఆర్ కు శస్త్రి చికిత్స జరిపి, హిప్ రిప్లేస్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకోవడానికి ఇంకా ఆరు వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే కేసీఆర్ కు చేసింది మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు చెప్పారు.

ఐవీ ఫ్లుయిడ్స్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మెడికేషన్ కొనసాగుతుందని, డాక్టర్ల పర్యవేక్షణలో సాధారణ డైట్ ఫాలో అవుతున్నారని చెప్పారు. గాయం నుంచి కొంత కోలుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయించుకుంటూ.. నడిచే ప్రయత్నం చేస్తారుని అన్నారు. కేసీఆర్ ఇంకా 5 వారాల పాటు హాస్పిటల్ లోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. సీనియర్ సిటిజన్ కావడంతో సాధారణ స్థితికి వచ్చి నడిచేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని యశోద హాస్పిటల్ వైద్యులు తెలిపారు.




'

Updated : 9 Dec 2023 1:07 PM IST
Tags:    
Next Story
Share it
Top