Home > తెలంగాణ > డాక్టర్ నిర్లక్ష్యం.. బాలింత మృతి

డాక్టర్ నిర్లక్ష్యం.. బాలింత మృతి

డాక్టర్ నిర్లక్ష్యం.. బాలింత మృతి
X

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేటలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందింది. దర్శన్ గడ్డ తండాకు చెందిన రోజా ఈ నెల 15న ప్రసవం కోసం అచ్చంపేట గవర్నమెంట్ ఆస్పత్రిలో చేరిది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ అదే రోజు రోజాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు.





పసిబిడ్డతో ఇంటికి చేరుకున్న రోజా అనారోగ్యానికి గురైంది. వారం రోజుల తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే మళ్లీ అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. రోజాను పరీక్షించిన డాక్టర్ పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.

బుధవారం రోజా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అచ్చంపేటకు తీసుకుని వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రోజా చనిపోయిందని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.




Updated : 23 Aug 2023 11:43 AM IST
Tags:    
Next Story
Share it
Top