Home > తెలంగాణ > విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజులు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజులు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజులు సెలవులు
X

వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20, 21న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో నేడు, రేపు కూడా విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం హాలీడేస్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొహర్రం సందర్భంగా ఈనెల 29న విద్యార్థులకు సెలవు కాగా 30న ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే సెలవు రోజుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈరోజు, రేపు అంటే బుధ, గురువారాలు ఎలాగూ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. శని, ఆదివారాలు కూడా సెలవులే.. ఇక మధ్యలో ఉన్న శుక్రవారం నాడు కూడా ఆప్షనల్ హాలీడే తీసుకుంటే ఐదురోజులు సెలవులు రానున్నాయని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28వ తేదీన మొహర్రం పండగ, 29వ తేదీన మొహర్రం జనరల్ హాలీడే ఉన్నాయి. 28వ ఆప్షనల్ హాలీడే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. 29న సెలవు స్కూళ్లకు వర్తించనుంది. 30న ఎలాగూ ఆదివారం కాబట్టి వరుసగా మొత్తం ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇక వర్షాల గురించి చెప్పాలంటే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా బాగానే వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 149.3 మిల్లీ మీటర్ల వర్షం కురవగా.. ఆసిఫ్ నగర్ లో 43.5 మిల్లీ మీటర్లు, ఆ తర్వాత టోలిచౌకీలో 37 మిల్లీ మీటర్లు, అల్వాల్ లో 3.3 మి.మీ, మాదాపూర్ లో 28 మి.మీ, మియాపూర్ లో 27 మి.మీ వర్షం కురిసింది.



Updated : 26 July 2023 2:06 PM IST
Tags:    
Next Story
Share it
Top