Lok Sabha Elections 2024 : మమతా కోసం ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి : కాంగ్రెస్
X
లోక్ సభ ఎన్నికల్లో మోదీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటు చేసినా.. పలు పార్టీలు ఆ కూటమిని వీడాయి. పంజాబ్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించగా.. వెస్ట్ బెంగాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ నుంచి సేమ్ సిట్యూవేషన్ ఎదురైంది. బెంగాల్ లో కాంగ్రెస్కు దీదీ రెండే సీట్లు ఇస్తామనడంతో ఆ పార్డీ నేతలు ఫైర్ అయ్యారు. మమతా దయాదాక్షిణ్యాల మీద తాము ఆధారపడలేదని అధీర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోకి టీఎంసీకి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా ఏకపక్షంగా ప్రకటించారు. కానీ మా వైపు నుంచి చర్చలు ఇంకా కొనసాగుతోన్నాయి. ఫైనల్ ప్రకటన వచ్చే వరకు మా వైఖరీ ఇదే అని జైరాం రమేష్ తెలిపారు.