Home > తెలంగాణ > GHMC పరిధిలో డబుల్ బెడ్రూంల పంపిణీ.. ఎప్పట్నుంచంటే..?

GHMC పరిధిలో డబుల్ బెడ్రూంల పంపిణీ.. ఎప్పట్నుంచంటే..?

GHMC పరిధిలో డబుల్ బెడ్రూంల పంపిణీ.. ఎప్పట్నుంచంటే..?
X

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూ ఇండ్ల పంపిణీకి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. జీహెచ్ఎంసీలో సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లతో ఈ అంశంపై ఆయన సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న తలసాని... ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇస్తున్నారని చెప్పారు.





తొలి విడతలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాల్లో 12 వేల మంది అర్హులకు ఇండ్ల పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధఇంచి ఈ నెల 24న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లోగా ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వచ్చేవారం డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 75 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసింది. వాటిలో దాదాపు 70వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వాటిని 5 నుంచి 6 దశల్లో లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.



Updated : 19 Aug 2023 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top