Home > తెలంగాణ > సెప్టెంబర్ 2 నుంచి హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ

సెప్టెంబర్ 2 నుంచి హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ

సెప్టెంబర్ 2 నుంచి హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
X

పేదలు సంతోషంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అందుకే వారికి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్‌ అలీతో కలిసి మంత్రి తలసాని డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు.





తొలి దశలో హైదరాబాద్లో మొత్తం 12వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందిస్తామని తలసాని స్పష్టం చేశారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుందన్న ఆయన.. తొలిసారి ఆన్ లైన్ డ్రా విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఎన్ఐసీ రూపొందించిన ర్యాండమ్ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని తలసాని సూచించారు. మొదటి విడతలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 500మందికి ఇండ్లు పంపిణీ చేస్తామని తలసాని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుందని చెప్పారు.



Updated : 24 Aug 2023 1:31 PM IST
Tags:    
Next Story
Share it
Top