డివైడర్ను ఢీకొన్న అంబులెన్స్.. ఆక్సిజన్ సిలిండర్ పేలి..
X
హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హై స్పీడ్‌లో వెళ్తున్న అంబులెన్స్ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మహేశ్ స్పాట్లోనే చనిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడి అంబులెన్స్ కాలి బూడిదైంది.
మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఇంటికి తీసుకెళ్లారు. పేషెంట్ను గమ్యస్థానానికి చేర్చిన అనంతరం తిరిగి వస్తుండగా సాగర్ రహదారిపై బీఎన్ రెడ్డి చౌరస్తా వద్ద అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో వాహనం బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతన్ని స్థానికులు బయటకు తీయగా తీవ్రగాయాలతో స్పాట్ లోనే చనిపోయాడు.
ప్రమాదం ధాటికి అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ కాలి బూడిదైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.