Home > తెలంగాణ > మెట్రో అధికారుల డ్రోన్ సర్వే.. పాతబస్తీ మెట్రోకు 103 అడ్డంకులు

మెట్రో అధికారుల డ్రోన్ సర్వే.. పాతబస్తీ మెట్రోకు 103 అడ్డంకులు

మెట్రో అధికారుల డ్రోన్ సర్వే.. పాతబస్తీ మెట్రోకు 103 అడ్డంకులు
X

పాతబస్తీ మెట్రో ప్రతిపాదనకు ఇటీవలే తెలంగాణ కేబీనెట్ లో ఆమోదం వచ్చింది. మెట్రో పనుల్లో భాగంగా అధికారులు ఓల్డ్ సిటీ మార్గంలో ఆదివారం (ఆగస్ట్ 27) డ్రోన్ సర్వేను నిర్వహించారు. పాతబస్తీ ప్రాంతాల్లోని ఇరుకైన మార్గంలో ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడంకోసం ఈ డ్రోన్ సర్వేను నిర్వహించారన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈ క్రమంలో మసీదులు, మందిరాలతో పాటు చాలా చోట్ల మొత్తం 103 సున్నితమైన ప్రదేశాలు అడ్డంకిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ 103 స్థలాల ప్రతికూల ప్రభావం లేకుండా ప్రణాళికలు చేస్తున్నామని.. మరికొన్ని రోజుల్లో భూ పరిశోధనకు టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అలైన్మెంట్, పిల్లర్ లొకేషన్ ల నిర్మాణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం చేపట్టిన డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైం డేటా, త్రీడీ మోడలింగ్, బీఐఎస్ డేటా, డేటా విశ్లేషణ, విజువలైజేషన్ ను సేకరించారు.


Updated : 27 Aug 2023 3:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top