Home > తెలంగాణ > మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు లైసెన్సులు రద్దు

మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు లైసెన్సులు రద్దు

మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు లైసెన్సులు రద్దు
X

నగరంలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. అధిక ధరలు, నాణ్యత లేని మందులు అమ్ముతున్న యజమానులపై చర్యలు తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పలు మెడికల్ షాపుల లైసెన్స్ లు పర్మనెంట్ గా.. మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేశారు.

నాంపల్లి సర్దార్ మెడికల్ హాల్, హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ (నాంపల్లి), అంబర్ పేట్ బయోస్పియర్ ఎంటర్ ప్రైజెస్, ఇందర్ బాగ్ కోటిలోని గణేష్ ఫార్మాసూటికల్స్, అక్షయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, చార్మినార్ భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, లంగర్ హౌజ్ ఆర్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, హిమాయత్ నగర్ అల్ హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీర మెడికల్ షాప్, ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్, మంగర్ బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ దుకాణాల్లో డ్రగ్స్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కఠిన శిక్ష పడేలా చేస్తామని అధికారులు తెలిపారు.


Updated : 8 Jun 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top