Drug Case : పంజాగుట్ట డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయలు
X
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉడోకో స్టాన్లీని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ విచారణలో అతడు కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. స్టాన్లీ గోవాలో మకాం వేసి దేశవ్యాప్తంగా 550 మందిని నియమించి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.హైదరాబాద్లో స్టాన్లీ కోసం పనిచేస్తున్న వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రగ్స్ కేసులో అరెస్టై గత మూడేళ్లుగా జైలులో ఉన్న ఓక్రా పేరును స్టాన్లీ బయట పెట్టారు.
స్టాన్లీ కాంటాక్ట్ లిస్టులో పలువురి ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి కూపీ లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 2009 నుంచి స్టాన్లీ ఇండియాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత 15 ఏళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తూ లో దేశ, విదేశాల్లో నేర సామ్రాజ్యం స్థాపించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ నెల 5న పంజాగుట్టలో నార్కోటిక్స్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.8కోట్లు విలువ చేసే ఎల్ఎస్డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.