Home > తెలంగాణ > Radisson Drug Case : రాడిసన్ డ్రగ్స్ కేసు.. బయటపడ్డ గోవా లింక్స్

Radisson Drug Case : రాడిసన్ డ్రగ్స్ కేసు.. బయటపడ్డ గోవా లింక్స్

Radisson Drug Case : రాడిసన్ డ్రగ్స్ కేసు.. బయటపడ్డ గోవా లింక్స్
X

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో మిస్సింగ్ లింక్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరాఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్ పంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ డ్రగ్స్ అబ్దుల్ నుంచి రెహ్మాన్.. రెహ్మాన్ నుంచి మీర్జా వాహిద్.. మీర్జా టూ అబ్బాస్.. అతడి నుంచి వివేకానంద్ డ్రైవర్కు డ్రగ్స్ చేరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అబ్దుల్ ప్రస్తుతం గోవా జైల్లో ఉన్నాడు.

కాగా డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలు ప్రస్తావించారు. వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్కు మీర్జా వాహిద్ ఫిబ్రవరిలోనే 10సార్లు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసులు తేల్చారు. ఫిలింనగర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో కొకైన్ చేతులు మారినట్లుగా గుర్తించిన పోలీసులు 2గ్రాముల కొకైన్కు రూ.30వేల చెల్లించినట్లు చెప్పారు.

హోటల్లోని 1200, 1204 రూమ్స్లో డ్రగ్ పార్టీలు జరిగినట్లు పోలీసులు రిపోర్టులో తెలిపారు. అటు హోటల్ ఆపరేషన్స్ మేనేజర్పై కేసు నమోదు చేశారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే కోణంలో ఆయన్ని విచారించనున్నారు. స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల విచారణకు క్రిష్ హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన శాంపిల్స్ తీసుకొని పంపించారు. అయితే యూరిన్ టెస్టులో నెగిటివ్ రాగా.. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బ్లడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా క్రిష్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

డ్రగ్స్‌‌ కేసులో తనను అరెస్ట్ చేయకుండా..ముందస్తు బెయిల్‌‌‌‌ మంజూరు చేయాలని ఇప్పటికే క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. ఆయన పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌‌‌‌ పేరును ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో చేర్చారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది పేర్లను FIRలో చేర్చారు. పోలీసుల విచారణకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు.


Updated : 3 March 2024 3:46 PM IST
Tags:    
Next Story
Share it
Top