Home > తెలంగాణ > మద్యం మత్తులో అంబులెన్సుకు కాల్ చేసిన వ్యక్తి ఆ తర్వాత ఏమైందంటే.. (వీడియో)

మద్యం మత్తులో అంబులెన్సుకు కాల్ చేసిన వ్యక్తి ఆ తర్వాత ఏమైందంటే.. (వీడియో)

మద్యం మత్తులో అంబులెన్సుకు కాల్ చేసిన వ్యక్తి ఆ తర్వాత ఏమైందంటే.. (వీడియో)
X

తాగిన మైకంలో కొందరు ఏం చేస్తారో వారికే అర్థం కాదు. ఒక్కోసారి ఆ మత్తులో జనాన్ని ఇబ్బంది పెడుతుంటారు. భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం మత్తులో ఎమర్జెన్సీ నెంబర్ 108 అంబులెన్సుకు కాల్ చేసిన ఓ ప్రబుద్ధుడు తనను అత్తగారింట్లో డ్రాప్ చేయాలని పట్టుబట్టాడు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా 108 సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

హైదరాబాద్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి కాలినడకన జనగాంకు బయలు దేరాడు. మద్యం మత్తులో ఉన్న అతను నడుచుకుంటూ భువనగిరి వరకు చేరుకున్నాడు. తాగిన మైకంలో నడవలేని స్థితికి చేరుకున్న సదరు ప్రబుద్ధుడు 108కు కాల్ చేశాడు. అంబులెన్సులో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది సదరు వ్యక్తి పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ఎందుకు కాల్ చేశావని ప్రశ్నించగా.. తాను అత్తగారింటికి వెళ్తున్నానని, అర్థరాత్రి కావడంతో బస్సులు లేవని అందుకే 108కు కాల్ చేశానని చెప్పాడు. అత్యవసర సమయాల్లో వైద్య సాయం కోసం చేయాల్సిన ఎమర్జెన్సీ నెంబర్ కు ఎందుకు ఫోన్ చేశావని ప్రశ్నించగా.. తనది కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని అందుకే కాల్ చేశానని సమాధానం ఇచ్చాడు. అతని మాటలు విని 108 సిబ్బంది అవాక్కయ్యారు. మందుబాబు తంతంగాన్నంతా వీడియో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ కాగా.. మరికొందరు మాత్రం 108 నెంబర్ దుర్వినియోగం చేయడంపై మండిపడుతున్నారు.

Updated : 1 Feb 2024 12:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top