Home > తెలంగాణ > శంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

శంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానం అత్యవసరంగా దిగింది. మందుబాబుల వీరంగంతో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దుబాయ్ నుంచి కొచ్చికి వెళ్తున్న విమానంలో నలుగురు ప్యాసింజర్లు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. పద్దతిగా ఉండాలని చెప్పిన విమాన సిబ్బందితో పాటు ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు.





క్యాబిన్ క్రూ విషయాన్ని పైలెట్ కు చెప్పడంతో శంషాబాద్ ఏటీసీకి సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతివ్వాలని కోరారు. అధికారులు ఓకే చెప్పడంతో పైలెట్ ఫ్లైట్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఆ నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్జీఏఐ పోలీసులకు అప్పజెప్పారు. నిందితులను కేరళకు చెందిన శివ కుమార్, మనోజ్, డెవిడ్, దేవాన్ష్ కుట్టిగా గుర్తించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. సిబ్బంది, తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడం, పక్కసీటు వారిపై మూత్రం పోయడం తదితర ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.




Updated : 25 Aug 2023 4:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top