Home > తెలంగాణ > ఐటీ మంత్రి ఎవరన్న సస్పెన్స్కు తెర..!

ఐటీ మంత్రి ఎవరన్న సస్పెన్స్కు తెర..!

ఐటీ మంత్రి ఎవరన్న సస్పెన్స్కు తెర..!
X

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ నెల 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే గత ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ, మున్సిపల్ శాఖ బాధ్యతల్ని ఎవరికి కట్టబెడతారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించి పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఉన్నత విద్యావంతుడైన శ్రీధర్ బాబుకు గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

ఇక తెలంగాణ డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పీకర్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత వివేక్ వెంకటస్వామికి పరిశ్రమ శాఖ, పద్మావతి ఉత్తమ్ రెడ్డికి సైతం మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Updated : 5 Dec 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top