Home > తెలంగాణ > గుంటూరు కారం సాంగ్ ఎలా ఉంది

గుంటూరు కారం సాంగ్ ఎలా ఉంది

గుంటూరు కారం సాంగ్ ఎలా ఉంది
X

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా గుంటూరు కారం. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ పాట ప్రోమో ట్యూన్ లీక్ అయింది. దీంతో వెంటనే మేకర్స్ ప్రోమోను అఫీషియల్ గా విడుదల చేశారు. ఫైనల్ గా దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, థమన్ కలిసి పాడారు.

సాంగ్ ట్యూన్ డిఫరెంట్ గా ఉంది. సాహిత్యం సైతం భిన్నమైన సందర్భాల్లో వచ్చేలా ఉంది. దీన్ని బట్టి ఇదో మాంటేజ్ సాంగ్ అనుకోవచ్చు. హీరోయిజం ఎలివేట్ చేస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ప్రతిసారీ వినిపించేలా ఉండబోతోందనుకోవచ్చు. అలాగే ఈ ట్యూన్ లోని ఆర్కెస్ట్రైజేషనే సిగ్నేచర్ ఆర్ఆర్ లానూ వాడేలా కనిపిస్తున్నారు. మాంటేజ్ సాంగ్ కు తగ్గట్టుగా రామజోగయ్య లిరిక్స్ మూడు కోణాల్లో సాగితే.. ఆ మూడు కోణాలతో పాటు పల్లవికీ కలిపి థమన్ కంపోజింగ్ కూడా అంతే భిన్నంగా ఉంది. దీంతో ఫస్ట్ టైమ్ వినగానే ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది కానీ.. ఆ ముక్కల్ని అతికించినట్టు భావించి వింటే బానే ఉన్నట్టు అనిపిస్తుంది.

బట్ త్రివిక్రమ్, తమన్ కాంబోలో వచ్చిన చివరి మూవీ అల వైకుంఠపురములో చిత్రానికి ఫస్ట్ సాంగ్ తోనే ఒక హైప్ వచ్చింది. గుంటూరు కారం ఆ హైప్ వచ్చేలా మాత్రం ఈ ట్యూన్ లేదు. ఉన్న ట్యూన్ లో అంత ఘాటు కూడా లేదు. మరి ఓవరాల్ గా చూస్తే ఓ సాధారణమైన ట్యూన్ తోనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వదిలారు అనిపిస్తోంది. అటు పల్లవిలోని పదాలు కూడా పట్టి పట్టి వింటే తప్ప అర్థం కావడం లేదు.


Updated : 7 Nov 2023 11:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top