విద్యార్థులకు అలర్ట్.. నేటితో దసరా సెలవులు ముగింపు
X
రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు రేపటి (అక్టోబరు 26) నుంచి పున:ప్రారంభం కానున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబరు 13 నుంచి 25 వరకు, జూనియర్ కాలేజీలకు 19 - 25 వరకు సెలవులు వచ్చాయి. దసరా సెలవులు ముగియనుండగా.. రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కాగా, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీలకు అక్టోబరు 24తో సెలవులు ముగియగా.. నేటినుంచే ప్రారంభంకానున్నాయి.
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 13 నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సారి మొత్తం 13 రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఇచ్చారు. దసరా సెలవులు ముగియడంతో తిరిగి అక్టోబరు 26న స్కూల్స్ తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 22న సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండగ ముగిసింది. ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండగ జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 24న కూడా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది.
జూనియర్ కాలేజీలకు అక్టోబరు 25 వరకు..
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నేటితో కాలేజీలకు సెలవులు ముగియనున్నాయి. దీంతో అక్టోబరు 26న కాలేజీలు తిరిగి ప్రారంభంకానున్నాయి.