Home > తెలంగాణ > E-KYC : ఈ నెల 31తో ముగియనున్న రేషన్ కార్డు ఈ-కేవైసీ

E-KYC : ఈ నెల 31తో ముగియనున్న రేషన్ కార్డు ఈ-కేవైసీ

E-KYC : ఈ నెల 31తో ముగియనున్న రేషన్ కార్డు ఈ-కేవైసీ
X

తెలంగాణలో రేషన్ కార్డులకు కేవైసీ తప్పనిసరి చేసింది రాష్ర్ట ప్రభుత్వం. ఈ నెల 31న రేషన్ కార్డులకు ఈ-కేవైసీ గడువు ముగియనుంది. బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. రేషన్ డీలర్లను సంప్రదించి వేలిముద్ర ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకొవాల్సిందిగా అధికారులు సూచించారు. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు అధికారులు. అయితే రేషన్ కార్డ్ కేవైసీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా కొనసాగుతోంది. రెండు జిల్లాల్లో 20 నుంచి 30 శాతం కార్డుదారులు కేవైసీని చేయించలేదు. అంతేగాక చనిపోయిన వారి పేర్లు, పెళ్లైన ఆడపిల్లల పేర్లను కూడా తొలగించక పోవడంతో...మరోసారి అధికారులు వేలిముద్రలను సేకరిస్తున్నారు. జనవరి 31వ తేదీలోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ సూచించారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి, మీ కుటుంబ సభ్యుల్లో మార్పులు చేర్పులు ఉంటే వెంటనే ఈ -కేవైసీ చేయించుకోండి. అంతేగాక కేవైసీ గడువు పెంచుతారా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.




Updated : 27 Jan 2024 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top