కాంగ్రెస్‌లోకి ఈటెల, కోమటిరెడ్డి.. ఫైనల్ డెసిషన్ పెండింగ్..
X
బీఆర్‌ఎస్, బీజేపీలు దగ్గరవుతున్నాయన్న అభిప్రాయం బీజేపీలోకి కొత్తగా చేరిన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొన్నటి వరకూ పదే పదే కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే నేతలంతా చల్లబడ్డారని, కాబట్టే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలో బీజేపీ కి గుడ్ బై చెప్పబోతున్నారని బయట టాక్. ఈ ఇద్దరూ నేతలూ కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ అనుసరిస్తున్న తీరు పట్ల విసిగిపోయారని, దీంతో ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని బయట ప్రచారం జరుగుతోంది. వీరి ప్రధాన ఎజెండా కేసీఆర్‌ను మరోమారు గద్దెనెక్కకుండా చేయడమే కాబట్టి అందుకోసమే హస్తం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను త్వరలో అరెస్టు చేయడంపై కేంద్ర బీజేపీ నాయకత్వం క్రియేట్ చేసిన హైప్ ఈ నాయకులకు చిరాకు కలిగించిందనేది టాక్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం.. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బెదిరించారని, బీఆర్‌ఎస్‌తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కూడా సీరియస్ గా లేదని అందువల్లే కాషాయానికి గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తుంది.
“బీజేపీని ఈ ఇద్దరూ నేతలు వీడడం వాస్తవమేనని, అయితే తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది” అని రాజ్‌గోపాల్ రెడ్డికి సన్నిహితుడైన సీనియర్ నాయకుడు తెలిపారు. " తెలంగాణలో BRS ను ఓడించాలంటే.. కాంగ్రెస్‌లో చేరడమే వారికి బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఆ పార్టీలోకి చేరడానికి ముందు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేయాలనుకుంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి.. తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినప్పటికీ, కేంద్ర బీజేపీ నాయకత్వం తనను గుర్తించలేకపోయిందని రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. స్థానిక నాయకత్వం ఆయనను పూర్తిగా విస్మరించడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని , అందుకే కాంగ్రెస్ గూటికి వెళ్లబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక పార్టీ మారేలా ఈటలను రాజగోపాల్ రెడ్డి ఒప్పిస్తున్నట్లు తెలిసింది. ఈటల మాత్రం ఇంకా ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.
Eatala Rajender and Komatireddy Rajgopal Reddy ‘moving’ towards Congress
former MLA , Munugode Komatireddy Rajgopal Reddy , former minister , Huzurabad MLA , Eatala Rajender , BJP-BRS closeness , T Congress, Revanth Reddy,