Home > తెలంగాణ > ఎన్నికలకు ఖర్చు చేయాల్సింది రూ.40 లక్షలే.. అభ్యర్థులకు ఈసీ ఆదేశాలు

ఎన్నికలకు ఖర్చు చేయాల్సింది రూ.40 లక్షలే.. అభ్యర్థులకు ఈసీ ఆదేశాలు

ఎన్నికలకు ఖర్చు చేయాల్సింది రూ.40 లక్షలే.. అభ్యర్థులకు ఈసీ ఆదేశాలు
X

తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది. అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ.40 లక్షలుగా నిర్ణయించింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని ఈసారి రూ.40 లక్షలకు పెచింది. అంతేకాకుండా లోక్ సభ ఎన్నికల వ్యయ పరిమితిని కూడా రూ.95 లక్షలకు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఒక్క మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఖర్చు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. కాగా, అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు.

ఈ నిర్ణయం తెలంగాణ, రాజస్థాన్‌ ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌తోపాటు ఏపీ, బీహార్‌, గుజరాత్‌, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు వర్తిస్తుంది. అయితే పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయంలోకి రాదని ఈసీ చెప్పుకొచ్చింది. అభ్యర్థి తన బ్యాంకు అకౌంట్ నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికోసం కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు ఎలాంటి ఖర్చులు చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, భోజనాలు, వాహనాల అద్దె, వాటి ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికా/టీవీ/సోషల్‌ మీడియా ప్రకటనలన్నింటినీ అభ్యర్థి రోజూవారి ఖర్చుగా లెక్కిస్తారు. అంతేకాకుండా వీటన్నింటికీ ఈసీ ఓ ధర నిర్ణయిస్తుంది. ఆ ధర ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Updated : 5 Nov 2023 2:42 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top