Home > తెలంగాణ > కేసీఆర్ ప్రభుత్వానికి షాక్.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ

కేసీఆర్ ప్రభుత్వానికి షాక్.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ

కేసీఆర్ ప్రభుత్వానికి షాక్.. అనుమతిని వెనక్కి తీసుకున్న ఈసీ
X

బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో రైతు బంధు నిధుల పంపిణీకి బ్రేక్ పడింది. నియమాలు ఉల్లంఘించారని ఈసీ అనుమతిని వెనక్కి తీసుకుంది. కాగా మూడు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28లోపు రైతుబంధు నిధులు ఇచ్చేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నిధులు జమచేసేందుకు సిద్ధమైంది. శనివారం, ఆదివారం, సోమవారం సెలవులు కావడంతో.. మంగళవారం నిధులు అకౌంట్లలో జమచేయాలని భావించింది. అయితే ఈసీ తన అనుమతిని వెనక్కి తీసుకోవడంతో దీనికి బ్రేక్ పడింది.

Updated : 27 Nov 2023 9:50 AM IST
Tags:    
Next Story
Share it
Top