కర్నాటక కాంగ్రెస్కు ఈసీ హెచ్చరిక
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ కూడా విసృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంత ప్రధాన నేతలంతా వచ్చి నియోజకవర్గాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును ఎండగడుతు.. క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆరునెలలుగా కర్నాటలో అమలు చేస్తున్న పథకాల గురించి అక్కడి ప్రభుత్వం తెలంగాణలోని న్యూస్ పేపర్లలో యాడ్స్ ఇస్తుంది. ఆ ప్రకటనలను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటివరకు ఇచ్చిన ప్రకటనలపై సంజాయిషీ ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
గత ఎన్నికల విషయాల్ని.. ప్రస్తుత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రకటించొద్దనే రూల్ ఉంది. ఈ నేపథ్యంలో.. ఈసీ నియమావలి ఉల్లఘించినందుకు కర్నాటక ప్రభుత్వంపై చర్యలు తీసుకోనున్నారు. కర్నాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర సీఎం, మంత్రులపై ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 కింద క్రిమినల్ కేసు పెట్టాలని బీజేపీ నేతలు ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తెలంగాణలో అలాంటి ప్రకటనలు నిలిపేయాలని, ఎన్నికల నియమావళిని ఎందుకు ఉల్లంఘించారో మంగళవారం 5 గంటల్లోపు సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు.