Home > తెలంగాణ > Telangana assembly elections 2023: తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్.. ఇకపై

Telangana assembly elections 2023: తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్.. ఇకపై

Telangana assembly elections 2023: తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్.. ఇకపై
X

తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ముగిసింది. దాదాపు నెల రోజుల నుంచి అమల్లో ఉన్న ఎన్నికల నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తి వేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల కోడ్‌ను ఈసీ ఎత్తివేసింది. అక్టోబర్ 9న షెడ్యూల్ విడుదల కాగా నవంబర్ 3న ఎన్నికల ప్రకటన జారీ చేసింది ఈసీ. నవంబర్ 10వ తేదీ వరకు నామపత్రాలను స్వీకరించారు. 13న నామపత్రాల పరిశీలన, 15న ఉప సంహరణ తర్వాత 30న పోలింగ్‌ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఈసీ ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. కోడ్ ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.EC lifted the election code in Telangana

Updated : 4 Dec 2023 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top