కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఈసీ ఆదేశం
X
అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు ఎలక్షన్ కమిషన్ అన్నిరకాల చర్యలు తీసుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలపై చర్యలు తీసుకుంటూ.. పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అభ్యర్థులంతా ఉన్న సమయాన్ని వినియోగించుకుని ప్రచారాన్ని పూర్తి చేశారు. చివరికోజున హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. ప్రజలతో భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఓటు వేసి గెలిపించాలని, లేదంటే.. తన కుటుంబంతో సహా ఉరేసుకుని చనిపోతామని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ అదేశించింది. మంగళవారం జరిపిన రోడ్ షోలో కౌశిక్ రెడ్ది మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ నివేదిక కోరింది.