తెలంగాణ ఎన్నికల్లో ఈ గుర్తులు ఉండవు: ఈసీ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమీషన్ సంచలన ప్రకటణ చేసింది. ఎన్నిక్లో ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తొలగించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఊరట దక్కింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ఆటో, హ్యాట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులు తొలగించడంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే ఇండిపెండెంట్ల కోసం కేటాయించిన 193 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చగా, ప్రస్తుతం వీటిని మినహాయించారు.
వాటిలోని ఈ నాలుగు గుర్తులను ఇక నుంచి ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మినహాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించొద్దని, దాని వల్ల నష్టపోతున్నామని గతంలో బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కంటి చూపు సరిగా లేని ఓటర్లు కారు గుర్తుకు బదులు వేరే కారును పోలి ఉన్న ఈ గుర్తుకు ఓటు వేసే అవకాశం ఉందని, దీనివల్ల తమ పార్టీ నష్టపోతుందని ఫిర్యాదు చేశారు. ఆయా గుర్తులను స్వతంత్ర, ఇతర పార్టీలకు కేటాయించకూడదని కోరారు. దాంతో ఈసీ ఈ నాలుగు గుర్తులను తెలుగు రాష్ట్రాల ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి మినహాయించింది. అయితే బీఆర్ఎస్ ఎవ్వరికీ ఇవ్వొదని కోరిన చపాతి కర్రను మాత్రం ఈసీ జాబితాలో అలాగే ఉంచింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.