Home > తెలంగాణ > ECIL Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్... ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు

ECIL Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్... ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు

ECIL Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్... ఈరోజు, రేపు ఇంటర్వ్యూలు
X

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హత, ఆసక్తిగల ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈరోజు, రేపు(గురు, శుక్రవారాల్లో) నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్‌లు, సెల్ఫ్-అటెస్టెడ్ ఫోటోకాపీల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ & రెజ్యూమ్‌తో ఉదయం 09.00 గంటలకు రిపోర్ట్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్‌లిస్టెడ్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.





ఉద్యోగ వివరాలు...





మొత్తం ఖాళీలు: 100

ఉద్యోగాలు - విభాగాలు:

మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​ తదితర విభాగాల్లో (ECIL Recruitment 2023) అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:

అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్​లో కనీసం 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.అభ్యర్థులు ప్రధానంగా సీఎస్​ఈ/ ఐటీ/ ఈసీఈ/ ఈఈఈ/ మెకానికల్​/ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్/​ ఇన్​స్ట్రుమెంటేషన్​ ఇంజినీరింగ్​ పూర్తి చేసి ఉండాలి.

పని అనుభవం :

అభ్యర్థులకు కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.​

ఎంపిక విధానం:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.ఇంజినీరింగ్​ డిగ్రీకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు లేదా 20 మార్కులు వేస్తారు. పూర్వపని అనుభవానికి కనిష్ఠంగా 10 మార్కులు నుంచి గరిష్ఠంగా 30 మార్కులు/ వెయిటేజీ ఇస్తారు.పర్సనల్​ ఇంటర్వ్యూను 50 మార్కులకు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్:

10వ తరగతి సర్టిఫికేట్​ (పుట్టిన తేదీ నిర్ధరణ కోసం)ఐడెంటిటీ ప్రూఫ్​ (ఆధార్​, పాస్​పోర్ట్ తదితర పత్రాలు)పాస్​పోర్ట్ సైజ్​ కలర్​ ఫొటోగ్రాఫ్స్​విద్యార్హతకు సంబంధించిన పత్రాలు (ఎస్​ఎస్​సీ, ఇంటర్​, బీఈ/ బీటెక్​ సర్టిఫికేట్స్​)CGPA కన్వర్షన్​ సర్టిఫికేట్​ఎక్స్​పీరియన్స్ సర్టిఫికేట్​కుల ధ్రువీకరణ పత్రందివ్యాంగులు.. బెంచ్​మార్క్ డిజేబులిటీ సర్టిఫికేట్​ తీసుకొని వెళ్లాలి.ఎక్స్-సర్వీస్​మెన్​.. డిస్​ఛార్జ్​ సర్టిఫికేట్​ చూపించాల్సి ఉంటుంది.

జీతభత్యాలు:

టెక్నికల్ ఆఫీసర్​ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు (ECIL Recruitment 2023) మొదటి సంవత్సరం నెలకు రూ.25,000 చొప్పున జీతంగా అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.28,000; 3వ, 4వ సంవత్సరాల్లో నెలకు రూ.31,000 చొప్పున జీతం ఇస్తారు. అలాగే మెడికల్​ ఇన్సూరెన్స్​, కంపెనీ పీఎఫ్​, టీఏ/డీఏ, పెయిడ్​ లీవ్స్​ తదితర భత్యాలు కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు నేరుగా ఈసీఐఎల్​ చెప్పిన అడ్రస్​కు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ : 2023 ఆగస్టు 10, ఆగస్టు 11ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఇంటర్వ్యూ అడ్రస్ : కార్పొరేట్​ లెర్నింగ్ అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్​, నలందా కాంప్లెక్స్​, టీఐఎఫ్​ఆర్​ రోడ్​, ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​, ఈసీఐఎల్​ పోస్టు, హైదరాబాద్​ - 500062




Updated : 10 Aug 2023 7:33 AM IST
Tags:    
Next Story
Share it
Top