Home > తెలంగాణ > కడిగిన ముత్యంలా బయటికి వస్తా: ఎమ్మెల్సీ కవిత

కడిగిన ముత్యంలా బయటికి వస్తా: ఎమ్మెల్సీ కవిత

కడిగిన ముత్యంలా బయటికి వస్తా: ఎమ్మెల్సీ కవిత
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కవితను హాజరు పరిచింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని, జ్యుడీషియల్ రిమాండ్ కు అప్పగించాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

15 రోజులు కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును అడిగింది. ఈ క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ఇది తప్పుడు కేసు. మనీలాండరిగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చాడు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటికి వస్తా. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టొచ్చు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేర’ని కవిత వ్యాఖ్యానించారు.

Updated : 26 March 2024 7:25 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top