ED notice :మంత్రి గంగులకు ఈడీ నోటీసులు
X
బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శ్వేత ఏజెన్సీ, శ్వేత గ్రానైట్స్ లకు ఈడీ నోటీసులిచ్చింది. ఆ సంస్థలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు తమకు అందించాలని ఈడీ కోరింది. ఈ క్రమంలో మాట్లాడిన గంగుల.. ఈడీ నోటీసుల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినా ఈడీ నోటీసులు ఇవ్వడం సాధారణమేనని, ఏ సమాచారం కావాలన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు గంగుల తెలిపారు. ఈడీ అధికారులకు ఏ సమాచారం కావాలన్నా మొదట నోటీసులు ఇస్తారని అన్నారు. అయితే తమ ఏజెన్సీలకు సంబంధించిన అన్నిరకాల డాక్యుమెంట్స్ ఇస్తున్నామని, వాటిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు గంగుల. తాము ఎక్కడా ఫెమా నిబంధనను ఉల్లంఘించలేదని, ఆర్బీఐ రూల్స్ కు అనుగునంగానే బిజినెస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2008 నుంచి ఈ సమస్య కొనసాగుతుందని ఈడీ అడిగిన ప్రతిసారీ వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. శ్వేత ఏజెన్సీ, శ్వేత గ్రానైట్స్ 100 శాతం పారదర్శకంగా ఉన్నాయన్న గంగుల వివరించారు.
2022 నవంబర్ లో కరీంనగర్ జిల్లా బవుపేట్ గ్రామంలోని గ్రానైట్ కంపెనీలపై ఈడీ, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు దాడి చేసి మూడు రోజుల పాటు సోదాలు జరిపారు. శ్వేతా గ్రానైట్స్ అధికారిక చిరునామాగా ఉన్న గంగుల ఇంట్లోనూ ఈడీ తనిఖీలు చేసింది. శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీల నుంచి రూల్ 26 (3)/ (i) m). AP MMC 1996 చట్టం ప్రకారం పెనాల్టీ, సీగ్నియరేజీని వసూలు చేయాలని అధికారులు సూచించారు.