కవిత భర్తకు ఈడీ నోటీసులు
X
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు.ఇప్పటికే నలుగురు ఫోన్లను సీజ్ చేశారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ ఆయన వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది.ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం రోజు ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. భర్త అనిల్ పాటు ఆమె వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా నలుగురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.